రేపు 'అఖండ' చిత్రం విడుదల... రెండు థియేటర్లలో బెనిఫిట్ షోలకు అనుమతిచ్చిన తెలంగాణ సర్కారు

  • బాలయ్య హీరోగా' 'అఖండ'
  • బోయపాటి దర్శకత్వంలో చిత్రం
  • థియేటర్లలో రిలీజవుతున్న 'అఖండ'
  • కూకట్ పల్లి భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో బెనిఫిట్ షోలు
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అఖండ' చిత్రం రేపు (డిసెంబరు 2) విడుదల కానుంది. థియేటర్లలో రిలీజవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, రెండు థియేటర్లలో 'అఖండ' చిత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కూకట్ పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో 'అఖండ' బెనిఫిట్ షోలకు ఆమోదం లభించింది.

'అఖండ' చిత్రంలో బాలకృష్ణ ఆఘోరాగా నటించడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ స్వరపరిచిన పాటలు ప్రజాదరణ పొందాయి.


More Telugu News