ఏపీలో రాగల మూడ్రోజులకు వర్ష సూచన
- నేడు ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం
- రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు
- దక్షిణ కోస్తాలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు
వాతావరణ శాఖ ఏపీలో రాగల మూడ్రోజులకు వర్ష సూచన చేసింది. ఇవాళ ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తన నివేదికలో వివరించింది.