సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం
- ఫిలిం ఛాంబర్ నుంచి మహాప్రస్థానంకు ప్రారంభమైన అంతిమయాత్ర
- మధ్యాహ్నం 11 గంటలకు అంత్యక్రియలు
- పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం
ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర ప్రారంభమయింది. ఉదయం నుంచి ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం జూబ్లీహిల్స్ లోని ఫిలింఛాంబర్ లో ఉంచారు. కాసేపటి క్రితం ఆయన భౌతికకాయాన్ని అక్కడి నుంచి తరలించారు. పుష్పాలతో అలంకరించిన వాహనంలో ఆయన పార్థివదేహం మహాప్రస్థానానికి బయలుదేరింది. అభిమానులు, కుటుంబసభ్యులు ఆయన పార్థివ దేహాన్ని అనుసరిస్తున్నారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరగనున్నాయి. అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.
మరోవైపు ఫిలింఛాంబర్ లో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సిరివెన్నెల పార్థివదేహానికి నివాళి అర్పించారు. వీరిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, శ్రీకాంత్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, శర్వానంద్, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మంత్రి పేర్ని నాని తదితరులు ఉన్నారు.