సిరివెన్నెల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

  • తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు
  • సినీ గీతాల్లో సాహిత్యం పాళ్లు తగ్గుతున్న తరుణంలో వచ్చారు
  • తెలుగు పాటకు ఊపిరిలూదారు
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని ఎంతో విచారించానని ఆయన తెలిపారు. నలుగురి నోటా పది కాలాల పాటు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సిరివెన్నెల సుసంపన్నం చేశారని కొనియాడారు.

తెలుగు సినీ గీతాల్లో సాహిత్యం పాళ్లు తగ్గుతున్న తరుణంలో వచ్చిన సీతారామశాస్త్రి... పాటకు ఊపిరిలూదారని సీజేఐ ప్రశంసించారు. సాహితీ విరించి సీతారామశాస్త్రి గారికి శ్రద్ధాంజలి అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.


More Telugu News