సిరివెన్నెల చనిపోవడానికి కారణాలు ఇవే: కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు
- ఆరేళ్ల క్రితమే క్యాన్సర్ వల్ల సగం ఊపిరితిత్తును తీసేయాల్సి వచ్చింది
- ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది
- కిడ్నీ కూడా డ్యామేజ్ అయింది
సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోవడానికి గల కారణాలను కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు మీడియాకు వివరించారు. ఆరేళ్ల క్రితమే క్యాన్సర్ తో సీతారామశాస్త్రి సగం ఊపిరితిత్తును తీసేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగిందని చెప్పారు. వారం క్రితం క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారని అన్నారు. ఆ తర్వాత కూడా రెండు రోజులు బాగానే ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తాయని... దీంతో అడ్వాన్స్ డ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్ కు తీసుకొచ్చారని వెల్లడించారు.
కిమ్స్ లో రెండు రోజుల పాటు వైద్యాన్ని అందించిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ప్రికాస్టమీ చేశామని... 45 శాతం ఊపిరితిత్తు తీసేశామని... మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. ఆయనను ఎక్మో మిషన్ పై పెట్టామని... గత ఐదు రోజుల నుంచి ఆయన ఎక్మో మిషన్ పైనే ఉన్నారని తెలిపారు. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఒబేసిటీ పేషెంట్ కూడా కావడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకిందని చెప్పారు. ఈ కారణాల వల్ల ఈరోజు సాయంత్రం 4.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని తెలిపారు.