సిరివెన్నెల మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రధాని
- సిరివెన్నెల మృతి వార్త విని ఎంతో ఆవేదన చెందానన్న వెంకయ్యనాయుడు
- ఆయన ప్రతి పాటను అభిమానించే వారిలో తాను కూడా ఒకడినని వ్యాఖ్య
- అత్యంత ప్రతిభావంతుడి మరణం తనను బాధించిందన్న మోదీ
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా గేయ రచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రిగారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో తాను కూడా ఒకడినని చెప్పారు.
సిరివెన్నెల మృతిపై మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. ఆయన రచనలతో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుందని అన్నారు. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. 'ఓం శాంతి' అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న ఫొటోను మోదీ పోస్ట్ చేశారు.