కుర్రహీరో జోడీగా లావణ్య త్రిపాఠి!

  • స్టార్ హీరోలతో చేసిన లావణ్య త్రిపాఠి
  • ఇటీవల కాలంలో దక్కని హిట్
  • కొత్త హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు  
లావణ్య త్రిపాఠి 'అందాల రాక్షసి' వంటి ఒక అందమైన ప్రేమకథా చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆమెలోని ఒక ప్రత్యేకమైన ఆకర్షణ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమెను పద్ధతిగా చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడ్డారు. నిదానమే ప్రధానమన్నట్టుగా ఆమె తన కెరియర్ ను కొనసాగించింది.

నాగార్జున .. నాని .. శర్వానంద్ .. రామ్ .. నిఖిల్ .. సందీప్ కిషన్ .. కార్తికేయ వంటి హీరోలతో కలిసి ఆమె నటించింది. వరుస సక్సెస్ లు రాకపోయినప్పటికీ, కొన్ని హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఆమె మరో యంగ్ హీరో జోడీ కడుతోంది .. ఆ హీరో పేరు నరేశ్ అగస్త్య. 'మత్తువదలరా' సినిమాలో హీరోకి ఫ్రెండ్ పాత్రను చేశాడు.

అదే సినిమా డైరెక్టర్ రితేష్ రాణా ఇప్పుడు నరేశ్ అగస్త్యను హీరోగా చేస్తూ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా నిర్మాతలే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. కొత్త హీరోతో చేయడానికి లావణ్య అంగీకరించడం విశేషమే.


More Telugu News