ఇవి ప్రభుత్వ హత్యలైతే పుష్కరాల మరణాలు ప్రకృతి వైపరీత్యానివా?: అంబటి
- ఏపీలో వరదలు
- ప్రాణనష్టంపై టీడీపీ విమర్శలు
- ప్రభుత్వ హత్యలని ఆరోపణలు
- నాటి గోదావరి పుష్కరాల మరణాలను గుర్తు చేస్తూ అంబటి కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో మరణాలు కూడా సంభవించాయి. అయితే, వైసీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, సమయానికి నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్లే మరణాలు సంభవించాయంటూ టీడీపీ చేస్తోన్న విమర్శలకు వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
'నేటి వరదల మరణాలు ప్రభుత్వ హత్యలైతే నాటి గోదావరి పుష్కరాల మరణాలు ప్రకృతి వైపరీత్యానివా?' అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాగా, ప్రకృతి వైపరీత్యాల నిధులు మళ్లించినట్లు కాగ్ తప్పుబట్టిందని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.