భారీ చెట్టును కొట్టేయకుండానే ఇల్లు కట్టుకున్న వ్యక్తి.. ఫొటోలు వైరల్
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో ఇల్లు
- చెట్టు కోసం ఇంటి డిజైన్‌ను మార్చేసుకున్న వ్యక్తి
- ఇప్ప చెట్టు ఇంటి మధ్యలో ఉన్న వైనం
సమస్త జీవజాలానికి చెట్లే ప్రాణాధారం. చెట్లను నరకకూడదని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ చాలా వాటిని నరుక్కుంటూ పోతున్నారు. గృహ నిర్మాణాలకు చెట్లు అడ్డంగా ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా వాటిని నరికేస్తుంటారు. అయితే, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ కు చెందిన ఆర్యన్ మహారాజ్ అనే వ్యక్తి మాత్రం తన స్థలంలోని భారీ చెట్టుని నరకకుండానే ఇల్లు కట్టుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు.
చెట్టు కోసం ఇంటి డిజైన్‌ను మార్చేసుకుని ఇంటిని కట్టాడు. కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టాడు. తాజాగా అది పూర్తయింది. తన స్థలంలోని ఓ ఇప్ప చెట్టు సరిగ్గా ఇంటి మధ్యలోకి వస్తుండటంతో ఇంటి ఆకృతిని మార్పు చేసి, చెట్టును కొట్టేయకుండా అలాగే ఉంచి మిద్దెమీదికి వెళ్లేందుకు వీలుగా ఓ చిన్నగదిని నిర్మించుకున్నాడు.
అంతేకాదు, కాంక్రీటు వల్ల చెట్టు ఎదగదన్న ఉద్దేశంతో ఆయన వెదురుబొంగులు, చెక్కలు, పెంకులతో గది పైకప్పును ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఆయనపై పర్యావరణ ప్రేమికులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.