నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం.. వాయుగుండంగా మారే చాన్స్
- దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడుతుంది
- 48 గంటల్లో బలపడే అవకాశం
- వాయుగుండంగా మారే చాన్స్
- తెలంగాణలో రాగల రెండు రోజులు పొడి వాతావరణం
దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పశ్చిమ వాయవ్య దిశగా కదిలిన అనంతరం 48 గంటల్లో బలపడుతుందని చెప్పారు. దీంతో ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
తెలంగాణలో రాగల రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. కాగా, అల్పపీడనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని, రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులోని సముద్రతీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడనం వల్ల కన్యాకుమారి తీరంలో ఉపరితల ఆవర్తనం తోడై తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అంతేగాక, అల్పపీడనం వాయుగుండంగా మారనున్న సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.