వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సజ్జల.. పరిహారం ఏమూలకు సరిపోదన్న బాధితులు

  • మంపు ప్రాంతాల్లో పర్యటించిన సజ్జల
  • వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల ఆవేదన
  • ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదన్న బాధితులు
  • ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని సజ్జల హామీ
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బాధితుల నుంచి నిరసన సెగ ఎదురైంది. భారీ వర్షాల కారణంగా ఇటీవల అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, గుండ్లూరు గ్రామాల్లో సజ్జల నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆయనకు నిరసన వ్యక్తమైంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోదని పులపుత్తూరు గ్రామస్థులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఒక ఏడాదిలో నమోదు కావాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతోనే జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు. సర్వే చేసి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఇళ్లను పూర్తిగా కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లను నిర్మించి ఇస్తామని సజ్జల హామీ ఇచ్చారు.


More Telugu News