చిన్నారులను హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తిప్పిన పంజాబ్ సీఎం
- తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన ఆనందంలో చిన్నారులు
- రెండోసారి మరింతమందిని హెలికాప్టర్‌లో తిప్పుతానన్న సీఎం
- చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ అందించడమే లక్ష్యమన్న చన్నీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చిన్నారులను తన హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. హెలికాప్టర్ ఎక్కిన చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తొలిసారి హెలికాప్టర్ ఎక్కడం, అందులోనూ ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడంతో పిల్లలు తెగ సంబరపడిపోయారు. సీఎం కూడా ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని చరణ్‌జిత్ పేర్కొన్నారు. రెండోసారి మరింతమంది పిల్లలను హెలికాప్టర్‌లో తీసుకెళ్లనున్నట్టు సీఎం తెలిపారు.
కెప్టెన్ అమరీందర్‌సింగ్ రాజీనామా తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కెప్టెన్ రాజీనామా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. కాగా, కొత్త పార్టీని ప్రకటించిన అమరీందర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు.