ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఏపీ మంత్రి ఆళ్ల నాని

  • ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ కలవరం
  • ఆందోళన అవసరంలేదన్న ఆళ్ల నాని
  • కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సూచనలు చేశారని వెల్లడి
  • విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి
ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529)పై ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ సూచనలు చేశారని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధీమాగా చెప్పారు. విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని స్పష్టం చేశారు.

అటు, జనవరి 15 లోపు వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేయాలని మంత్రి ఆళ్ల నాని అధికారులకు నిర్దేశించారు. ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, పూర్తి సంసిద్ధతతో ఉండాలని సీఎం చెప్పారని వివరించారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు.


More Telugu News