ఉస్మానియా వర్సిటీలో సమాధి... అసలు విషయం ఏంటంటే...!
- ఇంజినీరింగ్ హాస్టల్ వెనుక సమాధి
- సమాధిపై పూలు కూడా చల్లిన వైనం
- మార్నింగ్ వాక్ కు వెళ్లిన విద్యార్థులు
- సమాధిని చూసి హడలిపోయిన వైనం
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ సమాధి అందరినీ భయాందోళనలకు గురిచేసింది. ఇంజినీరింగ్ కాలేజి హాస్టల్ వెనుకభాగంలో ఖననం చేసినట్టు గుర్తుగా మట్టి కప్పి ఉంది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన విద్యార్థులు దీన్ని చూసి హడలిపోయారు. దానిపై పూలు కూడా చల్లి ఉండడంతో ఏదో శవాన్ని పూడ్చి ఉంటారని భావించారు.
ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. విచారణలో ఆసక్తికర అంశం వెల్లడైంది. అక్కడి బస్తీలో ఓ కుక్క చనిపోతే దాని యజమానులు హాస్టల్ వెనుకభాగంలో పూడ్చివేశారని ఓ వ్యక్తి వెల్లడించాడు. కుక్కను అక్కడ పడేస్తే కుళ్లిపోయి వాసన వస్తుందని, అందుకే వారు పూడ్చివేశారని ఘటనకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దాంతో విద్యార్థులు, వర్సిటీ అధికారులు హమ్మయ్య అనుకున్నారు.