మళ్లీ అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు
- ఈ నెల 23న గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- గత రాత్రి మరోమారు అస్వస్థత
- కొనసాగుతున్న చికిత్స
కరోనా బారినపడి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గత రాత్రి ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్‌కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. అయితే, గత రాత్రి మరోమారు ఆయన అస్వస్థతకు గురికావడంతో రాజ్‌భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆసుపత్రిని సంప్రదించాయి. గవర్నర్‌కు అదనపు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు.