సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
- ఇటీవల కరోనా బారినపడిన శివశంకర్ మాస్టర్
- హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించడంతో మృత్యువాత
- దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నింపుతూ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు వచ్చాయి.
తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వంటివారు శివశంకర్ మాస్టర్ చికిత్స కోసం విరాళాలు కూడా అందజేశారు. అటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా శివశంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే అందరినీ విషాదానికి గురిచేస్తూ శివశంకర్ మాస్టర్ నేడు తుదిశ్వాస విడిచారు. అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శివశంకర్ మాస్టర్ వయసు 72 సంవత్సరాలు. 1975 నుంచి ఆయన సినీ రంగంలో కొనసాగుతున్నారు. 10 భాషల్లో 800కి పైగా చిత్రాల్లో పాటలకు కొరియోగ్రఫీ అందించారు. నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో కనిపించారు. టెలివిజన్ రంగంలోనూ ప్రేక్షకులను అలరించారు.