ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగింపు
- ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సిన సీఎస్
- పదవీకాలం పెంచాలంటూ కేంద్రాన్ని కోరిన ఏపీ సర్కారు
- సానుకూలంగా స్పందించిన కేంద్రం
- వచ్చే ఏడాది మే 31 వరకు పదవీకాలం పొడిగింపు
రెండు నెలల కిందట ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ పదవీకాలం మరో 6 నెలలు పొడిగించారు. సమీర్ శర్మ వాస్తవానికి ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, ఆయన పదవీకాలాన్ని పొడిగించాలంటూ సీఎం జగన్ కార్యాలయం ఈ నెల మొదటి వారంలో కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామంటూ నేడు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కుల్దీప్ చౌదరి ఏపీ సర్కారుకు ప్రత్యుత్తరం పంపారు. సమీర్ శర్మ పదవీకాలాన్ని డిసెంబరు 1వ తేదీ నుంచి 2022 మే 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం తన లేఖలో పేర్కొంది.