పేరూరు డ్యామ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈత విన్యాసాలు... వీడియో ఇదిగో!
- భారీ వర్షాలకు నిండిన పేరూరు డ్యామ్
- గేట్లను ఎత్తి నీటి విడుదల
- గంగపూజ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్
- సామాజిక మాధ్యమాల్లో వీడియో
గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరు డ్యామ్ జలకళ సంతరించుకుంది. దాంతో డ్యామ్ లోని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో కలిసి గంగ పూజ నిర్వహించి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ గోరంట్ల డ్యామ్ లో బోటు విహారం చేశారు. అంతేకాదు, ఎంతో చలాకీగా డ్యామ్ లో ఈత కొట్టారు. పైనుంచి ఒక్కసారిగా నీళ్లలోకి దూకిన ఎంపీ గోరంట్ల తన ఈత విన్యాసాలతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.