అంతరించిపోతోన్న నదికి మళ్లీ ప్రాణం పోశారు: ప్రధాని మోదీ
- ఉత్తరప్రదేశ్‌లో నూన్ నది అంతరించిపోయే స్థితికి వచ్చింది
- స్థానిక ప్రజలు దాన్ని కాపాడాలన్న సంకల్పాన్ని తీసుకున్నారు
- కమిటీ ఏర్పాటు చేసుకుని పునరుద్ధరించారు
- సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదానికి ఇది ఉదాహరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో దేశ ప్రజలతో మాట్లాడారు. పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ లోని నూన్ నదీ అంతరించిపోయే స్థితికి రావడంతో స్థానిక ప్రజలు దాన్ని కాపాడాలన్న సంకల్పాన్ని తీసుకుని కమిటీ ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. చెరువును పునరుద్ధరించుకున్నారని మోదీ అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదానికి ఇది చక్కని ఉదాహరణ అని ఆయన చెప్పారు.
యువత జనాభా అధికంగా ఉన్న ప్రతి దేశంలో మూడు విషయాలు అతి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. ఆలోచనలు, ఆవిష్కరణ మొదటి అంశమైతే, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించాలన్న సంకల్పం రెండవదని చెప్పారు. నేను చేయగలను అన్న నమ్మకం మూడవదని చెప్పారు.
ఈ మూడు అంశాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, అద్భుతాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం మనం స్టార్టప్ అనే పదాన్ని బాగా వింటున్నామని ఆయన అన్నారు. ఇది స్టార్టప్ యుగమని, అలాగే ఈ స్టార్టప్ ప్రపంచంలో మన దేశం రాణిస్తోందని ఆయన చెప్పారు. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. భారత్‌లోని చిన్న పట్టణాల్లోనూ స్టార్టప్‌ల పరిధి పెరిగిందని ఆయన తెలిపారు.