న్యాయ విచారణ జరిపించాలి: ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ
- ఏపీలో వరదలు.. ప్రభుత్వ వైఫల్యం
- ప్రభుత్వ అంచనా మేరకు రూ.6,054 కోట్ల నష్టం
- నిధులు మళ్లించినట్లు కాగ్ తప్పుబట్టింది
- ప్రజలను ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అంచనా మేరకు రూ.6,054 కోట్ల నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటికి కేవలం రూ.35 కోట్లు మాత్రమే విడుదల చేయడం సరికాదని అన్నారు.
ప్రకృతి వైపరీత్యాల నిధులు మళ్లించినట్లు కాగ్ తప్పుబట్టిందని ఆయన చెప్పారు. అలాగే, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారిని ఆదుకోవాలని కోరారు. ఏపీలో వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోయారని ఆయన అన్నారు.
అలాగే, ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సాయం అందించాలని ఆయన కోరారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాల్సి ఉందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సాయం అందించాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సాయం అందించాలని చెప్పారు. పంట నష్ట పరిహారాన్ని పెంచాలని కోరారు.