పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం

  • ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • డిసెంబరు 23 వరకు సమావేశాలు
  • టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
  • పలు అంశాలపై చర్చ
ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ లోక్ సభ సభ్యులు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. లోక్ సభ, రాజ్యసభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు వారితో చర్చించారు.

పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల మళ్లింపు వ్యవహారం, ఉపాధి హామీ నిధుల మళ్లింపు, ఈఏపీ నిధుల దారి మళ్లింపు, రాష్ట్రంలో చమురు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో వరి వేయొద్దని మంత్రులు ప్రకటించిన వైనం, వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని చంద్రబాబు నిర్దేశించారు.


More Telugu News