వరి కొనకపోతే కేసీఆర్, మోదీలను ఉరితీయడం ఖాయం: రేవంత్ రెడ్డి
- ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష
- పాల్గొన్న రేవంత్ రెడ్డి
- సీఎం కేసీఆర్ పై ధ్వజం
- కేసీఆర్ గద్దె దిగాల్సి ఉంటుందని హెచ్చరిక
ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. రైతుల మృతికి సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. వరి ధాన్యం కల్లాల్లోనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంలేదని, మద్దతు ధర ఇవ్వడంలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. రైతులపై కక్షగట్టిన సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయకుండా దళారీగా మారారని విమర్శించారు.
ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్, మోదీ డ్రామాలు ఆడుతున్నారని, వరి కొనకపోతే వారిద్దరినీ ఉరితీయడం ఖాయమని అన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ వేరు కాదని, ఒకరు సారా అయితే మరొకరు సోడా అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని స్పష్టం చేశారు. రైతుల కోసం ఈ రాత్రి ధర్నా చౌక్ లోనే నిద్రిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ వరి దీక్ష చేపట్టడం తెలిసిందే.