నాగచైతన్యతో విడిపోయాక తొలిసారి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన సమంత

  • విడిపోయిన చై-సామ్
  • తీవ్ర నిరాశకు గురైన అభిమానులు
  • శాకుంతలం చిత్రంలో నటిస్తున్న సమంత
  • డబ్బింగ్ చెప్పేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ కు రాక
టాలీవుడ్ లో ఒకప్పుడు క్యూట్ కపుల్ గా పేరుగాంచిన నాగచైతన్య, సమంత తమ దాంపత్యానికి స్వస్తి పలకడం అభిమానులను నిరాశకు గురిచేసింది. చై, సామ్ ల వైవాహిక బంధంలో చాలాకాలం నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నా, తాము విడిపోతున్నామంటూ వారు చేసిన ప్రకటన అటు టాలీవుడ్ ను సైతం నివ్వెరపరిచింది.

తాజాగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నాగచైతన్యతో విడిపోయాక సమంత తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్ లో దర్శనమిచ్చింది. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణలు మాత్రమే కాదు డబ్బింగ్ పనులు కూడా జరుగుతుంటాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తాను నటిస్తున్న 'శాకుంతలం' చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం సమంత అన్నపూర్ణ స్టూడియోస్ కు విచ్చేసింది. అయితే ఈ విషయం తెలియనివాళ్లు అన్నపూర్ణ స్టూడియోస్ కు సమంత ఎందుకు వచ్చి ఉంటుంది అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం నాగచైతన్య, సమంతల విడాకుల ప్రక్రియ నడుస్తోంది. వారిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే వారి వైవాహిక బంధం విడాకుల రూపంలో అధికారికంగా ముగియనుంది.


More Telugu News