ప్రధాని మోదీ అత్యవసర సమావేశం.. బెంబేలెత్తిస్తున్న ఈ అంశమే ప్రధాన అజెండా!
- ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న సమావేశం
- కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్న ప్రధాని
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన అజెండా
ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరగబోతోంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో మన దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించనున్నారు. దీంతో పాటు దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నమోదైన సరికొత్త, ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఈ వేరియంట్ పై ఇప్పటికే వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో కొత్త వేరియంట్ కేసులు నమోదు కానప్పటికీ... ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.