తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఆయుధాలను వెంట ఉంచుకునేందుకు వ్యాపారులకు అనుమతి
- దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
- ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వ్యాపారులపై దాడులు
- వ్యాపారులు, పెట్టుబడిదారుల రక్షణకు కట్టుబడి ఉన్నామన్న తాలిబన్లు
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వ్యాపారులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
వ్యాపారులు తమ స్వీయ రక్షణ కోసం ఆయుధాలను వెంట తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయా సాంకేతిక సమస్యల పరిష్కారం అనంతరం ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు తెలిపింది. వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖోస్టాయ్ తెలిపారు.