జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయ్యారు.. ఆయన వైఎస్సార్ రాజకీయ వారసుడు కాదు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- జగన్ తండ్రి పేరును ఉపయోగించుకుని సీఎం కాలేదు
- చంద్రబాబు ఇక రాజకీయాల్లో ఎదగలేరు
- ప్రతిపక్ష నేతగానూ ఇదే చివరి అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ రాజకీయ వారసుడు కాదంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురంలో నిన్న జరిగిన సమీక్ష కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. జగన్ తన తండ్రి పేరును ఉపయోగించుకుని ముఖ్యమంత్రి కాలేదన్నారు. పాదయాత్రతో ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు తెలుసుకున్నారని అన్నారు. రైతులు, కూలీలు సహా అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. కాబట్టి ఆయన వైఎస్సార్ రాజకీయ వారసుడు అవరని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం ప్రజలను ఏమార్చిన చంద్రబాబుకు భవిష్యత్తులో అక్కడ కూడా ఆయనకు స్థానం ఉండదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వరదల్లో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తామంటున్న చంద్రబాబు గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వారికి ఎన్ని కోట్లు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక రాజకీయాల్లో ఎదగడం కష్టమని, ప్రతిపక్ష నేతగానూ ఆయనకు ఇదే చివరి అవకాశమని నారాయణస్వామి చెప్పుకొచ్చారు.