ఏపీలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు.. తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు
- బంగాళాఖాతంలో 29న అల్పపీడనం
- బలపడి పశ్చిమ, వాయవ్య దిశగా కదిలే అవకాశం
- ఈశాన్య భారతదేశం నుంచి తెలంగాణవైపు గాలులు
తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు దక్షిణంగా ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, ఆ తర్వాత అది బలపడి పశ్చిమ, వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.
ఈశాన్య భారతదేశం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వస్తుండడంతో నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.