ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం
- తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
- మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు
- నిన్నటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే మిగిలిన వైనం
- మిగిలిన 6 స్థానాలకు డిసెంబరు 10న ఎన్నికలు
తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు ఏకగ్రీవం అయ్యారు. మొత్తం 12 స్థానాలకు నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. ఇందులో ఆరు స్థానాలకు కేవలం టీఆర్ఎస్ అభ్యర్థులే మిగిలారు. దాంతో ఆ 6 స్థానాలు ఏకగ్రీవం అయినట్టు నిర్ధారించారు.
ఏకగ్రీవం అయిన వారిలో కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఆమె ఉమ్మడి నిజామబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయ్యారు. కవితతో పాటు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు (రంగారెడ్డి జిల్లా), కూచికుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్ జిల్లా), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్) ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 6 స్థానాలకు డిసెంబరు 10న ఎన్నికలు నిర్వహించన్నారు.