సన్ రైజర్స్ కు మళ్లీ వార్నరే కెప్టెన్ గా రావాలంటున్న అభిమానులు
- గత ఐపీఎల్ సీజన్ లో వార్నర్ పేలవ ప్రదర్శన
- కెప్టెన్సీతో పాటు ఆటగాడిగానూ స్థానం కోల్పోయిన వైనం
- మనస్తాపానికి గురైన వార్నర్
- ఈసారి కొత్త జట్టుకు ఆడే అవకాశం
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓ పర్యాయం చాంపియన్ గా నిలిపి, ఆ జట్టుకు విశేషమైన సేవలు అందించిన ఆటగాడు డేవిడ్ వార్నర్. అయితే గత సీజన్ లో వార్నర్ పేలవమైన ఫామ్ కు తోడు, సన్ రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టగున నిలిచింది. వార్నర్ టోర్నీ మధ్యలోనే కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు, తుది జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. అనామక ఆటగాడిలా రిజర్వ్ బెంచ్ కు పరిమితం అయ్యాడు. ఈ పరిణామం వార్నర్ ను తీవ్రంగా కలచివేసింది. సన్ రైజర్స్ తరఫున తన ప్రస్థానం ముగిసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో అభిమానులు మరోలా భావిస్తున్నారు. సన్ రైజర్స్ జట్టుకు మళ్లీ వార్నరే కెప్టెన్ గా రావాలని కోరుకుంటున్నారు. వార్నర్ ను అట్టిపెట్టుకోవాలని, అతడిని వేలానికి విడిచిపెట్టొద్దని అభిమానులు సన్ రైజర్స్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వార్నర్ వంటి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాడిని జారవిడిచుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు.
ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లో విధ్వంసక ఇన్నింగ్స్ లతో మళ్లీ ఊపందుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలవడంలో వార్నర్ ముఖ్యపాత్ర పోషించాడు. దాంతో అభిమానులు వార్నర్ పునరాగమనం కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కానీ వార్నర్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. తాను మళ్లీ సన్ రైజర్స్ ఆడలేనని స్పష్టం చేశాడు. కెప్టెన్ గా వార్నర్, కోచ్ గా టామ్ మూడీ రావాలని ఓ అభిమాని పేర్కొనగా, "నో థ్యాంక్స్" అంటూ వార్నర్ తన మనసులో మాట వెల్లడించాడు.
వచ్చే సీజన్ లో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు కూడా ఐపీఎల్ లో అరంగేట్రం చేస్తున్నాయి. వాటిలో ఒక జట్టు వార్నర్ ను కెప్టెన్ గా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ వచ్చే సీజన్ నుంచి నాయకత్వం వహించడంలేదు. ఈ నేపథ్యంలో, ఆర్సీబీ జట్టు కూడా వార్నర్ పై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి సమాధానాలు రావాలంటే మరికొన్ని రోజుల్లో జరగనున్న ఐపీఎల్ వేలం వరకు ఆగాల్సిందే.