స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవ జోరు.. 11 స్థానాలు ఆ పార్టీవే!

  • ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • నిన్న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
  • బరిలో వైసీపీ అభ్యర్థులు మాత్రమే మిగిలిన వైనం
  • మండలిలో 31కి పెరిగిన వైసీపీ బలం
ఏపీ శాసనమండలిలో వైసీపీ బలం మరింత పెరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యారు. తూమాటి మాధవరావు (ప్రకాశం), ఇందుకూరు రఘురాజు (విజయనగరం), వై.శివరామిరెడ్డి (అనంతపురం), ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు (గుంటూరు), కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు), అనంత ఉదయభాస్కర్ (తూర్పు గోదావరి), మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురాం (కృష్ణా జిల్లా), వంశీకృష్ణ యాదవ్, వి.కల్యాణి (విశాఖ)లు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

నిన్న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు కాగా, వైసీపీ అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దాంతో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్టు రిటర్నింగ్ అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఎన్నికల అనంతరం మండలిలో వైసీపీ బలం 31కి పెరిగింది.


More Telugu News