'ప్రాజెక్టు K' సెట్స్ పైకి ప్రభాస్!

  • వచ్చేనెల 14న 'రాధే శ్యామ్' రిలీజ్
  • 'ఆది పురుష్'ను పూర్తిచేసిన ప్రభాస్
  • వచ్చేనెల 2 నుంచి 'ప్రాజెక్టు K' మొదలు
  • ముగింపు దశలో 'సలార్'
ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 14వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'ఆది పురుష్' సినిమాను కూడా పూర్తిచేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది.

ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ 'సలార్' పైన పూర్తి దృష్టి పెడతాడనీ, ఈ సినిమా పూర్తయిన తరువాత 'ప్రాజెక్టు K' పైకి వెళతాడని అంతా అనుకున్నారు. కానీ వచ్చేనెల 2వ తేదీ నుంచి ప్రభాస్ 'ప్రాజెక్టు K' సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఆ రోజున ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను మొదలుపెడుతున్నారట.

'ప్రాజెక్టు K' ఫస్టు షెడ్యూల్ పూర్తయిన తరువాతనే, ప్రభాస్ తిరిగి 'సలార్' షూటింగులో పాల్గొంటాడట. అక్కడి నుంచి ఆ సినిమా పూర్తయ్యేంతవరకూ దానిపైనే ఉంటాడని అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ పక్కా ప్లానింగ్ తోనే దూసుకుపోతున్నాడు. ఇక లైన్లో సందీప్ రెడ్డి వంగా ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News