మ్యాచ్ కు ముందే పాక్ ను చూసి భారత ఆటగాళ్లు భయపడిపోయారు.. పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ తీవ్ర వ్యాఖ్యలు

  • టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పై స్పందన
  • టాస్ లోనే తెలిసిందన్న ఇంజమామ్
  • కోహ్లీ బాడీ లాంగ్వేజ్ బాలేదని కామెంట్
  • భారత ఆటగాళ్లంతా ఒత్తిడిలో ఉన్నారంటూ వ్యాఖ్యలు
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై భారత్ ఓటమి గురించి పాకిస్థాన్ టీం మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ స్పందించాడు. ఆ రోజు మ్యాచ్ కు ముందు నుంచే పాక్ ను చూసి భారత ఆటగాళ్లు భయపడిపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వారంతా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారన్నాడు. ఆ విషయం మ్యాచ్ టాస్ తోనే బయటపడిందన్నాడు.

టాస్ వేసేటప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బాడీ లాంగ్వేజ్ లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించిందని తెలిపాడు. బాబర్ ఆజంలో ఆత్మ విశ్వాసం కనిపించిందని, కోహ్లీ మొహంలో భయం, ఒత్తిడి కనిపించాయని చెప్పాడు. మొదటి మూడు ఓవర్లలో రోహిత్, రాహుల్ లు ఔటైనా పెద్ద నష్టమేమీ లేదని చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఔట్ అవడానికన్నా ముందే భారత్ ఒత్తిడిలో ఉందన్నాడు. రోహిత్ శర్మే ఒత్తిడిలో ఉన్నాడని చెప్పాడు.

టీ20ల్లో టీమిండియా చాలా గొప్ప జట్టని, గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే టీమిండియానే వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ అని అన్నాడు. కానీ, వరల్డ్ కప్ లో వారి ప్రదర్శన అస్సలు బాగాలేదన్నాడు. పాక్ మ్యాచ్ వారిపై ఒత్తిడిని పెంచిందన్నాడు. స్పిన్ ను బాగా ఎదుర్కొనే టీమిండియా ఆటగాళ్లే.. న్యూజిలాండ్ స్పిన్ ద్వయం శాంట్నర్, సోధిలకు పడిపోవడం చూస్తే జాలేస్తోందని అన్నాడు.


More Telugu News