సీఎం జగన్ పెన్షన్లకు కూడా కులాన్ని ఆపాదిస్తున్నారు : హర్షకుమార్

  • ఒక్క దళితుడికైనా ఈ ప్రభుత్వం రుణం ఇచ్చిందా?
  • అన్ని శాఖలకు మంత్రిగా సజ్జల వ్యవహరిస్తున్నారు
  • మంత్రులను జనాలు చితకబాదే సమయం ఆసన్నమైంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న పెన్షన్లకు కూడా కులాన్ని ఆపాదించే దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్క దళితుడికైనా వైసీపీ ప్రభుత్వం రుణం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అన్ని శాఖలకు తానే మంత్రి అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రులు బయటకొస్తే జనాలు చితకబాదే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు బీజేపీ నేత లంకా దినకర్ కూడా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో వ్యాపారఛాయలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కొత్త విధానాలతో దండుకోవడం జగన్ స్టైల్ అని విమర్శించారు. నవరత్నాల పేరుతో జనాల నెత్తిన శఠగోపాలు పెడుతున్నారని అన్నారు. గతంలో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా... కొత్త ఇళ్లు సరిగా కట్టి ఇవ్వకుండా.. పేదల నుంచి ఈ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని విమర్శించారు.


More Telugu News