‘జీవోటీ’ నుంచి ‘ఇంటూ ద వైల్డ్’ దాకా.. సినిమాల్లో మెప్పించిన స్టార్ ఎలుగు ఇక లేదు!
- అనారోగ్యంతో కన్నుమూసిన ‘బార్ట్ ద బేర్ 2’
- సినిమాలు, సిరీస్ లు, షోలు, ప్రకటనల్లో మెప్పించిన ఎలుగు
- 20 ఏండ్ల క్రితం దత్తత తీసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ
చాలా సినిమాల్లో ఆ ఎలుగుబంటి ‘కీలక పాత్ర’ల్లో నటించింది. నటనతో ఆకట్టుకుంది. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఆ ఎలుగు ఇకలేదు. అనారోగ్యంతో ‘బార్ట్ ద బేర్ 2’ కన్నుమూసింది. 2000వ సంవత్సరంలో అలాస్కాలోని అడవుల్లో తన సిస్టర్ ఎలుగు ‘హనీ బంప్’తోపాటు చిన్న వయసులోనే ఇది అధికారులకు దొరికింది. వేటగాడికి బలైన తన తల్లిపక్కన ఉన్న చిన్న ఎలుగులను తీసుకొచ్చి సంరక్షించారు. అది పెరిగాక సినిమా ఆఫర్లు వచ్చాయి. సినిమాల్లోనేకాక, టీవీ షోలు, ప్రకటనల్లోనూ అది తళుక్కున మెరిసింది.
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ (జీవోటీ)’ సిరీస్ తో అది ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే, అంతకుముందే చాలా సినిమాల్లోనూ అది మెరిసింది. డాక్టర్ డూ లిటిల్ 2, యాన్ అనిఫినిష్డ్ లైఫ్, ఇంటూ ద వెస్ట్, ఇంటూ ద వైల్డ్, ఈవాన్ ఆల్మైటీ, హేవ్ యూ హర్డ్ అబౌట్ మోర్గాన్స్, వితౌట్ ఏ ప్యాడిల్, జూకీపర్, పీట్స్ డ్రాగన్, వీ బాట్ ఏ జూ, ద గ్రిజ్లీ మేజ్ వంటి హిట్ చిత్రాల్లో కనిపించింది.
దాని మరణంపై జీవోటీలో దానితో ఫైట్ చేసిన గ్వెండాలీన్ క్రిస్టీ విచారం వ్యక్తం చేసింది. దాని ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. తన సినీ కెరీర్ లో అత్యుత్తమ కో–స్టార్ బార్ట్ ద బేర్ అని పేర్కొంది. దానిని సైలెంట్ చేసేందుకు అది నటించిన సినిమా ట్రైలర్లు, నాటు, పాశ్చాత్య సంగీతాన్ని సెట్స్ లో ప్లే చేస్తుండేవారని గుర్తు చేసుకుంది. బార్ట్ తో నటించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని, దాని మరణంతో తన గుండె ముక్కలైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జీవోటీలో ఎలుగుతో ఫైట్ చేసిన ఫొటోను పోస్ట్ చేసింది.
ఓ గొప్ప ఎలుగుతో ఇన్నాళ్లూ కలిసి ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నామని దాని సంరక్షణ బాధ్యతలను చూస్తున్న ‘ద వైటల్ గ్రౌండ్ ఫౌండేషన్’ పేర్కొంది. యూటాలోని డేనియల్ క్రీక్ ఒడ్డున ప్రశాంతంగా బార్ట్ కన్నుమూసిందని తెలిపింది. ఫౌండేషన్ లో దానిని ఇష్టపడే ఎంతోమందితో పాటు తన సోదరి హనీని వదిలివెళ్లిందంటూ ఫౌండేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.