'శేఖర్' విషయంలో ఏం జరిగిందనేది సస్పెన్స్!
- 'శేఖర్'గా రాజశేఖర్ మూవీ
- మలయాళ 'జోసెఫ్'కి రీమేక్
- లలిత్ దర్శకత్వంలో పట్టాలెక్కిన ప్రాజెక్టు
- ఫస్టు గ్లింప్స్ లో కనిపించని లలిత్ పేరు
చాలా కాలం తరువాత 'గరుడ వేగ'తో తనకి వచ్చిన విజయానికి కొనసాగింపు ఉండేలా చూసుకోవాలని రాజశేఖర్ అనుకున్నారు. కానీ ఆ వెంటనే చేసిన 'కల్కి' చిత్రమే ఆయనను నిరాశ పరిచింది. ఆ తరువాత ఆయన మంచి కథల కోసం వెయిట్ చేస్తుండటంతోనే గ్యాప్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన 'శేఖర్' సినిమాను ఎనౌన్స్ చేశాడు.
మలయాళ మూవీ జోసెఫ్ కి ఇది రీమేక్. తాను కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా మారిపోయి రాజశేఖర్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగాడు. ఈ సినిమాకి లలిత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేసినప్పుడు, దర్శకుడిగా లలిత్ పేరు కనిపించకపోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
లలిత్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడా? తప్పించారా? అనేది సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కూడా ఆయా కారణాల వలన, ముందుగా అనుకున్న దర్శకులతో ప్రాజెక్టు ముందుకు వెళ్లనప్పుడు జీవితనే దర్శకత్వ బాధ్యతలను భుజాన వేసుకున్న సందర్భాలు ఉన్నాయి.