హాలీవుడ్ సినిమాలో మరింత బోల్డ్ గా సమంత.. ‘కొత్త ప్రపంచం’ అంటూ హీరోయిన్ ప్రకటన
- ‘ద అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలో అవకాశం
- ‘డౌన్ టౌన్ యాబీ’ డైరెక్టర్ ఫిలిప్ జాన్ తో సినిమా
- తిమేరి ఎన్.మురారి నవల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత జోష్ పెంచేసింది. వరుస సినిమాలకు సైన్ చేసేస్తూ జోరు చూపిస్తోంది. వివాహ బంధం నుంచి వైదొలిగిన కొన్నాళ్లకే మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్న సామ్.. నిన్ననే బాలీవుడ్ సినిమాను కన్ఫర్మ్ చేసింది. తాజాగా హాలీవుడ్ బంపరాఫర్ ను చేజిక్కించుకుంది. ఫిలిప్ జాన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనుంది. తిమేరి ఎన్.మురారి రచించిన ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా.. అదే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
‘ఓ కొత్త ప్రపంచం’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ‘‘సరికొత్త ప్రపంచం. 2009లో తొలిసారి ‘ఏ మాయ చేసావే’ సినిమా కోసం ఆడిషన్స్ లో పాల్గొన్నా. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆడిషన్స్ లో పాల్గొంటుంటే ఏదో ఆందోళన. ‘డౌన్ టౌన్ యాబీ’ సిరీస్ తో బాఫ్టా అవార్డును గెలిచిన డైరెక్టర్ ఫిలిప్ జాన్ తో హాలీవుడ్ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను ఎంపిక చేసినందుకు ఫిలిప్ జాన్ కు కృతజ్ఞతలు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సునీత తాటి, గురు ఫిల్మ్స్ కు ధన్యవాదాలు. ఈ జర్నీ చేయడానికి ఎదురుచూస్తున్నా. ఓ అభిమాని శుభాకాంక్షలు చెప్పగా.. దేశం పేరును నిలబెడతానని ఆమె రిప్లై ఇచ్చింది.
కాగా, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించి వేడెక్కించిన సమంత.. ఈ హాలీవుడ్ సినిమా కోసం మరింత హాట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె బై సెక్సువల్ పాత్రలో నటించనుందని సమాచారం.