సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్
- భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచు
- ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్
- టీమిండియా స్కోరు 98 ఓవర్లకు 313/7
భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే, ఆ కాసేపటికే మరో ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు. 171 బంతులు ఆడిన శ్రేయాస్ 105 పరుగులు చేశాడు. ఆరంగేట్రం చేసిన టెస్టులోనే ఆయన సెంచరీ సాధించడం గమనార్హం. దీంతో టీమిండియాలో ఆరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన 16వ బ్యాట్స్ మన్ గా శ్రేయాస్ నిలిచాడు.
టీమిండియా బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ 13, శుభమన్ గిల్ 52, ఛటేశ్వర్ పూజారా 26, అజింక్యా రహానె 35, రవీంద్ర జడేజా 50, వృద్ధిమాన్ సాహా 1 పరుగు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 20, అక్షర్ పటేల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 98 ఓవర్లకు 313/7గా ఉంది.