చైనాలో ముదురు బెండకాయల్లా అబ్బాయిలు.. పెరిగిపోతున్న ‘బ్యాచిలర్స్’
- యువతకు శాపంగా మారిన ప్రభుత్వ విధానాలు
- అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య కోట్లలో ఎక్కువ
- ఏడికేడు దారుణంగా పడిపోతున్న వివాహాల సంఖ్య
- పెళ్లిళ్లు చేసుకునేందుకు 43 శాతం మంది అమ్మాయిలు ససేమిరా
- తరచి చూస్తే బోలెడు కారణాలు
చైనాలో పెళ్లి మాట ఎత్తితేనే యువకులు భయపడిపోతున్నారు. ఫలితంగా ముదురు బెండకాయల్లా మిగిలిపోతున్నారు. జీవన వ్యయం పెరిగిపోతుండడం, తగినంతమంది అమ్మాయిలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. దీనికితోడు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు కూడా నేటి యువతకు శాపంగా పరిణమించాయి. ఇప్పుడు తేరుకుని నష్టనివారణ చర్యలు ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. యువత క్రమంగా కనుమరుగవుతుండగా, వృద్ధుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
చైనాలో ఏడాదికేడాదికి పెళ్లిళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ‘చైనా ఇయర్ బుక్ 2021’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో గతేడాది పెళ్లిళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు.
అధిక జనాభాను అరికట్టేందుకు దశాబ్దాలుగా చైనా చేపట్టిన చర్యలు ఆ దేశాన్ని వృద్ధ దేశంగా మార్చాయి. దీంతో కళ్లు తెరిచిన ప్రభుత్వం 2016లో ఏకైక సంతానం నిబంధనలకు స్వస్తి చెప్పి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల కూడా ఆశించిన ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది.
పెళ్లి చేసుకునేందుకే యువత జంకుతున్న వేళ.. ఎంతమంది పిల్లలకు అనుమతిస్తే ఏం లాభమని పెదవి విరుస్తున్నారు. పెళ్లిపై యువత ఇంతగా నైరాశ్యం పెంచుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పిల్లల చదువుల ఖర్చు భారంగా మారడం, ఉద్యోగం, వ్యాపారాల్లో విపరీతమైన ఒత్తిడి, అమ్మాయిలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడం వంటివి పెళ్లిపై అనాసక్తికి కారణమవుతున్నాయి.
దీనికితోడు అక్కడ స్త్రీలకంటే పురుషుల సంఖ్య ఏకంగా 3.49 కోట్లు ఎక్కువ. 20 ఏళ్లలోపు వయసు పురుషుల సంఖ్య అయితే మహిళల కంటే 17.5 కోట్లు ఎక్కువని తేలింది. దీంతో యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. అంతేకాదు, 43 శాతం మంది అమ్మాయిలు కూడా పెళ్లికి విముఖత చూపుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది.