ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎంపిక!
- టెస్ట్ టీమ్ కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్
- వైస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ఎంపిక
- గత వారం కెప్టెన్ పదవికి రాజీనామా చేసిన టిమ్ పెయిన్
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ లను ఆ జట్టు బోర్డు ఎంపిక చేసింది. కెప్టెన్ గా ఆల్ రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ పేరును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. 'ఆస్టేలియా టెస్ట్ క్రికెట్ జట్టు 47వ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్' అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఐదుగురు సభ్యుల సెలెక్షన్ ప్యానల్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు ఒక ఫాస్ట్ బౌలర్ పూర్తి స్థాయి కెప్టెన్ గా ఎంపిక కావడం ఇదే తొలిసారి. అంతేకాదు రిచీ బెనాడ్ తర్వాత ఏ ఫార్మాట్లో అయినా కెప్టెన్ గా ఎంపికైన తొలి బౌలర్ కమ్మిన్స్ కావడం గమనార్హం.
గత వారం కెప్టెన్సీ పదవికి టిమ్ పెయిన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఒక మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశాడు. మరోవైపు తనను టెస్ట్ కెప్టెన్ చేయడం పట్ల కమ్మిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. యాషెస్ సిరీస్ కి ముందు కెప్టెన్ గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని చెప్పాడు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. సీనియర్ ప్లేయర్లు, యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్న ఆసీస్ జట్టును స్టీవ్ స్మిత్ తో కలిసి విజయపథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.