సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ సర్కారుపై ఎన్జీటీ అసహనం

  • తెలంగాణకు కొత్త సచివాలయం
  • పాతది కూల్చివేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం
  • ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి
  • పర్యావరణ అనుమతులు లేవని ఫిర్యాదు
తెలంగాణ పాత సచివాలయం కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అయితే సచివాలయం కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే సచివాలయాన్ని కూల్చివేశారని ఆరోపించారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జీటీ మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఎన్జీటీ చెన్నై బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారో, లేదో సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. తెలంగాణ సర్కారు హైదరాబాదులోని లుంబినీ పార్క్ వద్ద కొత్త సచివాలయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News