వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి డిసెంబరు 2 వరకు సీబీఐ కస్టడీ
- వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
- ఇటీవల కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి అరెస్ట్
- కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ పిటిషన్
- నేడు విచారణ జరిపిన పులివెందుల కోర్టు
- 7 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ... అతడిని 8 రోజులు కస్టడీకి అప్పగించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఆ పిటిషన్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం శివశంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతించింది. అయితే 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 2 వరకు సీబీఐ కస్టడీ కొనసాగనుంది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.