ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- భారత వాతావరణ శాఖ ప్రకటన
- రేపు, ఎల్లుండి వర్షాలు
- ఈ నెల 29న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం
- బలపడి 48గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే చాన్స్
తమిళనాడు, పుదుచ్చేరిలో నేటి నుంచి 29వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే, రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరం, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అంతేగాక, ఈ నెల 28, 29 తేదీల్లోనూ దక్షిణ కోస్తా తీరం, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, కేరళలోనూ నేటి నుంచి 29వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం, తమిళనాడుకు ఆనుకుని ఉండే కొమరిన్ ప్రాంతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో నేడు, రేపు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తమిళనాడు తీరంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లోకి మత్స్యకారులు వెళ్లకూడదని తెలిపింది. ఈ నెల 29న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది బలపడి 48గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.