'ఆర్ఆర్ఆర్'లోని సన్నివేశాలన్నింటికీ ఈ పాట ఆత్మలాంటిది: రాజమౌళి
- రేపు జనని పాట విడుదల
- సినిమాలోని సీన్లను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జనని పాట అలా ఉంటుంది
- రెండు నెలల పాటు కీరవాణి కష్టపడ్డారు
- ఆర్ఆర్ఆర్‌లో బోలెడన్ని యాక్షన్ స్వీక్వెన్స్ ఉంటాయి
'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'జనని' గీతాన్ని రేపు విడుదల చేస్తామని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఆ పాట ప్రత్యేకత గురించి మీడియాతో రాజమౌళి మాట్లాడారు. ఈ సినిమాలోని సన్నివేశాలన్నింటికీ జనని పాట ఆత్మలాంటిదని వివరించారు.
ఈ సినిమాలో భావోద్వేగభరిత సన్నివేశాలు ప్రేక్షకుల గుండెను తాకేలా ఉంటాయని రాజమౌళి చెప్పారు. ఈ విషయాలను పంచుకోవాలని నేడు మీడియాతో మాట్లాడుతున్నానని చెప్పారు. భావోద్వేగానికి సంగీత రూపం ఇస్తే ఎలా ఉంటుందో జనని పాట అలా ఉంటుందని తెలిపారు.
ఈ సినిమాలో యాక్షన్ సీన్లు మామూలుగా ఉండబోవని రాజమౌళి చెప్పారు. ఆర్ఆర్ఆర్‌లో బోలెడన్ని యాక్షన్ స్వీక్వెన్స్ ఉంటాయని చెప్పారు. హీరోల ఇంట్రడక్షన్ సీన్లు, ప్రీ క్లైమ్యాక్స్, క్లైమ్యాక్స్, యాక్షన సీక్వెన్స్ వంటివి బోలెడు ఉంటాయని తెలిపారు. అన్నింటిలోనూ ఎమోషన్లు ఉంటాయని చెప్పారు. వాటన్నింటినీ లోతుగా చూస్తే ఎలా ఉంటుందో అలా జనని పాట ఉండేలా చూసుకున్నామని తెలిపారు.
రెండు నెలల పాటు కీరవాణి ఈ పాట కోసం కష్టపడ్డారని ఆయన చెప్పారు. తాను ఈ రోజు చేసేది సినిమా ప్రమోషన్ కాదని, ప్రమోషన్ అంటే వేరేలా ఉంటుందని రాజమౌళి అన్నారు. జనని పాట గురించి వివరించడానికే తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ఈ పాటలోని ఎమోషన్ ను ఫీల్ కావాలని ఆయన అన్నారు.