ఏపీ దిశా కమిటీలో 'ప్రముఖ సభ్యుడు'గా బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు పర్యవేక్షణకు దిశా కమిటీ
  • సీఎం ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ
  • జీవీఎల్ నియామకంపై కేంద్రం ఆదేశాలు
  • ట్విట్టర్ లో వెల్లడించిన జీవీఎల్
రాష్ట్రంలో కేంద ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించే దిశా కమిటీలో తనకు స్థానం కల్పించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. దిశా కమిటీలో 'ప్రముఖ సభ్యుడు' (Eminent Member)గా తనను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నియమించిందని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.


More Telugu News