ఎలాంటి సాయం కావాలన్నా అడగండి.... నటుడు కైకాల కుమారుడికి సీఎం జగన్ ఫోన్
- తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల
- హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
- నిన్న కైకాల ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం జగన్
- నేడు కైకాల చిన్న కుమారుడితో మాట్లాడిన వైనం
ఏపీ సీఎం జగన్ ఇవాళ నటుడు కైకాల సత్యనారాయణ చిన్నకుమారుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావుతో ఫోన్ లో మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం జగన్ నిన్ననే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
తాజాగా కైకాల చిన్న కుమారుడు రామారావుకు ఫోన్ చేశారు. కైకాల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. అటు, ఏపీ సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.