కమల్ హాసన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

కమల్ హాసన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
  • ఇటీవల కరోనా బారినపడిన కమల్ హాసన్
  • అమెరికా వెళ్లొచ్చిన తర్వాత స్వల్ప అస్వస్థత
  • కరోనా పరీక్షల్లో పాజిటివ్
  • చెన్నైలో శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స
ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల కరోనా బారినపడడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి వర్గాలు తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశాయి. కమల్ హాసన్ కు కరోనా చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలో అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నాయని వివరించారు. రక్తపోటు, షుగర్ స్థాయిలు అన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన కమల్ దగ్గుతో బాధపడుతుండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.


More Telugu News