మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: సాయిధరమ్ తేజ్
- రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకోయాను
- 26న జీ5లో విడుదల అవుతోంది
- చూసి రెస్పాన్స్ ఇవ్వండి
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో పక్కటెముకలు విరగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ తన కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు.
సాయి ధరమ్‌తేజ్ నటించిన సినిమా ‘రిపబ్లిక్’ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 26న సినిమాను జీ5లో విడుదల చేయనుండడంతో తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ను తేజ్ విడుదల చేశారు. ఈ మెసేజ్‌కు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్‌ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో మెసేజ్ ఉంది.
ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సాయితేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని పేర్కొన్నారు. సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయితేజ్ చివర్లో జైహింద్ అని ముగించారు.