దేశంలో 10 వేలకు దిగువన రోజువారీ కరోనా కేసులు
- దేశంలో గణనీయంగా తగ్గిన పాజిటివిటీ రేటు
- కొత్తగా 9,283 పాజిటివ్ కేసులు
- 437 మంది మృతి
- ఇంకా 1,11,481 మందికి చికిత్స
- 537 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసుల సంఖ్య
భారత్ లో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో దేశం మొత్తమ్మీద 9,283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10,949 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్కరోజు వ్యవధిలో 437 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,66,584కి పెరిగింది.
ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,481 కాగా, 537 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కేసులు ఈ స్థాయికి దిగిరావడం ఇదే ప్రథమం. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోయిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,481 కాగా, 537 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కేసులు ఈ స్థాయికి దిగిరావడం ఇదే ప్రథమం. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు బాగా తగ్గిపోయిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.