నీట్ లో టాప్-100లో నిలిచిన ఏపీ విద్యార్థులు వీరే!
- ఇటీవల నీట్ ఫలితాలు విడుదల
- టాప్-100లో 11 మంది ఏపీ విద్యార్థులు
- నీట్ ర్యాంకర్ల వివరాలు విడుదల చేసిన ఎన్టీఆర్ వర్సిటీ
- మెరిట్ జాబితా తర్వాత విడుదల చేస్తామన్న వీసీ
ఇటీవల నీట్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ర్యాంకర్ల వివరాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. నీట్-2021లో టాప్-100లో ఏపీకి చెందిన విద్యార్థులు 11 మంది ఉన్నారు. వీరిలో 8 మంది జనరల్ కేటగిరీ విద్యార్థులు కాగా, ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందినవారు.
కాగా, ఏపీ నుంచి నీట్ కు హాజరైన వారిలో 39,388 మంది అర్హత సాధించినట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కటాఫ్ మార్కుల వివరాలు పరిశీలిస్తే... జనరల్ కేటగిరీకి 138, జనరల్ పీడబ్ల్యూటీ కేటగిరీకి 122... బీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూడీ సహా) కేటగిరీకి 108 కటాఫ్ మార్కులుగా పేర్కొన్నారు.
టాప్-100లో నిలిచిన ఏపీ విద్యార్థుల వివరాలు...
దీనిపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పందిస్తూ... ఇది ప్రాథమిక సమాచారం కోసం మాత్రమేనని, మెరిట్ లిస్టు తర్వాత విడుదల చేస్తామని చెప్పారు.

- చందం విష్ణు వివేక్- 13వ ర్యాంకు
- జి.రుషీల్- 15వ ర్యాంకు
- పి.వెంకట కౌశిక్ రెడ్డి- 27వ ర్యాంకు
- కేతంరెడ్డి గోపీచంద్ రెడ్డి- 36వ ర్యాంకు
- టి.సత్యకేశవ్- 41వ ర్యాంకు
- పి.వెంకటసాయి అమిత్- 47వ ర్యాంకు
- పి.కార్తీక్- 53వ ర్యాంకు
- ఎస్.వెంకట కల్పజ్- 58వ ర్యాంకు
- కె.చైతన్య కృష్ణ- 71వ ర్యాంకు
- పి.సాకేత్- 84వ ర్యాంకు
- వి.నిఖిత- 89వ ర్యాంకు
దీనిపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పందిస్తూ... ఇది ప్రాథమిక సమాచారం కోసం మాత్రమేనని, మెరిట్ లిస్టు తర్వాత విడుదల చేస్తామని చెప్పారు.