టమాటాల కోసం... ఓ బిర్యానీ సెంటర్ వినూత్న ఆఫర్
- విపరీతంగా పెరిగిపోయిన టమాటాల ధర
- కిలో రూ.100కి పైనే పలుకుతున్న వైనం
- తమిళనాడులో ఓ బిర్యానీ సెంటర్ యజమాని వినూత్న ఆలోచన
- రెస్టారెంట్ కు పోటెత్తిన జనాలు
దేశంలో టమాటాల ధర కొండెక్కింది. గత కొన్ని రోజులుగా టమాటా ధర కిలో రూ.100కి పైనే పలుకుతోంది. చెన్నైలో కిలో టమాటా కొనాలంటే రూ.150 చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఓ బిర్యానీ సెంటర్ వినూత్న ఆఫర్ తీసుకువచ్చింది. మధురాంతకంలో ఉండే అంబూర్ బిర్యానీ హోటల్ ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి బిర్యానీ ఎంతో రుచికరంగా ఉంటుందని భోజన ప్రియులు చెబుతుంటారు.
అయితే, టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయిన అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఆ బిర్యానీ హోటల్ యజమాని ఈ ఆఫర్ తీసుకువచ్చాడట. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే.... 2 కేజీల బిర్యానీ కొనుగోలు చేసిన వారికి అర కేజీ టమాటాలు ఫ్రీ! లేదా, ఒక కేజీ టమాటాలు తెచ్చి ఇస్తే వారికి ఒక 1 కేజీ బిర్యానీ ఫ్రీ!
ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత అంబూర్ రెస్టారెంట్ కు జనాల రద్దీ బాగా పెరిగిపోయింది. కిలో టమాటాలు తెచ్చి కిలో బిర్యానీ తీసుకెళ్లేవాళ్లు, రెండు కేజీల బిర్యానీతో పాటు అరకేజీ టమాటాలు తీసుకెళ్లే వాళ్లతో హోటల్ కిటకటలాడుతోందట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.